బీజేపీ పతనానికి గోతులు తీస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త.. ??

రాష్ట్ర రాజకీయాలే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయంటున్నారు విశ్లేషకులు.. మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు మోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. అదే ఊపు, అదే స్పీడ్‌తో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి క్రమక్రమంగా సమస్యలు ఎదురవుతున్నాయి.. ఆ పార్టీ విదివిధానాలు నచ్చక పోవడం ఏమో తెలియదు గానీ బీజేపీ నుంచి మిత్రులు దూరమైపోవడం, శత్రువులు పెరగడం జరుగుతుంది.. ఇక ఎలాగైనా బీజేపీని కూల్చాలని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతం కమళం చేస్తున్న తప్పులను 2023 ఎన్నికల్లో క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ శక్తి చాలడం లేదు. అందుకే దేశంలో మూడో ఫ్రంట్ దిశగా అడుగులు పడుతున్నాయట.

ఇలా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతుండగా ఈ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కమళం పతనానికి బీజం వేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.. ఇందుకు గానూ దేశవ్యాప్తంగా పలు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారట. జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేసి అమలు చేస్తున్నారట. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో సమావేశమైనట్లు తెలుస్తోంది.

ఇకపోతే తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. దీంతో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉందని ఎలాగో కాంగ్రెస్ పని ఖతమైందని అంచనాకు వచ్చి బీజేపీకీ వ్యతిరేక కూటమిలో టీఆర్ఎస్ కూడా భాగస్వామిని చేయడానికి ప్రశాంత్ కిషోర్, కేటీఆర్ ను కలిసినట్లుగా ప్రచారం జరుగుతుంది.. ఇక వైఎస్ జగన్ తో కూడా ప్రశాంత్ కిషోర్ స్నేహం కంటిన్యూ అవుతుంది.. మరి వైసీపీ బీజేపీ తో సఖ్యతగా ఉంటున్న ఈ విషయంలో తల దూర్చడం లేదు.. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ పతనానికి గోతులు తీస్తున్నాడట.. అంటే రానున్న ఎన్నికల్లో ఈ కూటమి కమళానికి గట్టిపోటీ ఇస్తుందని అంటున్నారు విశ్లేషకులు..