Prakash Raj Sensational Post : దాదాపు పది నెలల కాలం నుంచి ఏపీలో టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా మారిపోయిందో తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నుంచి ఇప్పుడు భీమ్లా నాయక్ వరకు ఏపీ ప్రభుత్వ వైఖరికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి.
అయితే ఇది అంతా కేవలం పవన్ ని టార్గెట్ చెయ్యడం కోసమే అని సినీ పరిశ్రమ వారి వాదన కాగా మాకు అలా ఏమీ లేదు అందరి సినిమాలు ఒకటే అని ఏపీ ప్రభుత్వ వాదన. అయితే పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం గొడవలు ఇలా కొనసాగుతూ ఉండగా తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj Sensational Post) మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి సంబంధించి గొంతెత్తారు.
ఏపీ ప్రభుత్వం ఒక ఎండ్ కార్డు వెయ్యాలని అనుకుంటున్నానని.. సినీ పరిశ్రమపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటని, చిత్ర పరిశ్రమని క్షోభ పెడుతూ మేమే ఆడుకుంటున్నాం అంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. అలాగే మీకు ఏమన్నా ఉంటే రాజకీయాల్లో చూసుకోవాలి కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ కక్ష సాధింపులు ఎందుకు అని ప్రశ్నించారు.
ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు అడ్డుకట్ట వెయ్యలేరని సంచలన పోస్ట్ పెట్టారు. మరి దీనికి ఏపీ ప్రభుత్వం నుంచి ఏమన్నా కౌంటర్ అటాక్ వస్తుందేమో చూడాలి.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive 🙏🏻🙏🏻🙏🏻#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022