Bheemla Nayak Success : ఆంధ్రప్రదేశ్‌లో ‘భీమ్లానాయక్’ ఫంక్షన్ పెడతారా.?

Bheemla Nayak Success

Bheemla Nayak Success :  ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైద్రాబాద్‌లో పెట్టారు.. మరి, సక్సెస్ ఫంక్షన్ ఆంధ్రప్రదేశ్‌లో పెడతారా.? పెట్టరా.? ఈ విషయమై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రమోషన్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. గతంలో అయితే, పవన్ కళ్యాణ్ అసలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు లేదా ఆడియో పంక్షన్లకు సుముఖత వ్యక్తం చేసేవారే కాదు. సినిమా ఇంటర్వ్యూల సంగతి సరే సరి. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మధ్య తన సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో పవన్ కనిపిస్తున్నారు.

సో, ‘భీమ్లానాయక్‘ సినిమా ప్రచారానికి సంబంధించి పవన్ పబ్లిక్ అప్పీయరెన్స్ ఇకపై వుండకపోవచ్చు. ఈ వారాంతం వసూళ్ళ జాతర వుంటుంది. ఆ తర్వాత నెమ్మదిస్తుంది.. అది సినిమా ఈక్వేషన్. మళ్ళీ వచ్చేవారాంతంలో జోరు పెరగొచ్చు.. వీకెండ్ పూర్తయ్యాక.. పూర్తిగా చప్పబడిపోవచ్చు.

ఈలోగా పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లానాయక్’ సక్సెస్ ఫంక్షన్ (Bheemla Nayak Success) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టించాలంటూ పవన్ అభిమానులు, చిత్ర నిర్మాణ సంస్థకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. మరి, ఈ వినతిని ‘భీమ్లానాయక్’ నిర్మాతలు సానుకూలంగా పరిశీలిస్తారా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

సినిమా విడుదల విషయమై నానా రకాల ఆంక్షలూ పెట్టిన ఏపీ సర్కారు, సినిమా సక్సెస్ ఫంక్షన్ పెడితే.. ఇంకెంత రచ్చ చేస్తుందో.!