Prabhas: కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…. తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఏ మాత్రం విరామం లేకుండా గడుపుతున్న ఈయన మరో సినిమాలో కీలక పాత్రలలో నటించబోతున్న విషయం కూడా తెలిసిందే. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో ప్రభాస్ బాగమయ్యారు.

ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావటం విశేషం ఈ సినిమా కోసం ఈయన భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేస్తున్నారు అలాగే ఇతర చిత్ర పరిశ్రమల నుంచి స్టార్ సెలబ్రిటీలను కూడా ఇందులో భాగం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన సెలబ్రిటీలందరికీ సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు గత కొద్దిరోజులుగా హల్చల్ చేశాయి.

ఇటీవల శివుడి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారనే విషయం తెలిసిందే .దీంతో ప్రభాస్ పాత్ర ఏంటి అనే విషయంపై అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అన్న సందేహం కూడా అందరిలోనూ ఉంది.

ఇక ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారని దాదాపు ఈయన పాత్ర 40 నిమిషాల వరకు ఉండబోతుందని తెలుస్తుంది. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ నటించగా నంది పాత్రలో ప్రభాస్ నటించిన బోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తే తప్ప తన పాత్ర ఏంటి అనేది స్పష్టం అవ్వదు. 40 నిమిషాల నిడివి అంటే మామూలు విషయం కాదు ప్రభాస్ ఒక్కో సినిమాకు సుమారు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. మరి ఈ సినిమాకు తక్కువలో తక్కువ ఒక 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని అందరూ భావిస్తున్నారు.

ఇలా ప్రభాస్ ఈ సినిమా కోసం 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి కానీ తన స్నేహితుడి కోసం ప్రభాస్ ఏ మాత్రం రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా ఈ సినిమాలో నటించారని తెలుస్తోంది. ముఖ్యంగా మంచు మోహన్ బాబుతో ప్రభాస్ కి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈయన రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించబోతున్నారని సమాచారం.