Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఇంకా పట్టాలెక్కకముందే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్.
ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభాస్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ లో కాకుండా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్ కి నిరాశ తప్పదు అని చెప్పాలి. మరి ఈలోపు ప్రభాస్ మరి ఏదైనా సినిమాను బరిలోకి దింపుతారేమో చూడాలి మరి.
Prabhas: సంక్రాంతి బరిలో ప్రభాస్ రాజాసాబ్.. మరి డిసెంబర్ లో?
