Prabhas: సాధారణంగా ఒక హీరోతో సినిమా చేయాలి అంటే ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉంది మార్కెట్ పరంగా తనకున్నటువంటి వ్యాల్యూ ఏంటి అనే విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఆ హీరో పై బడ్జెట్ అనేది కేటాయిస్తూ ఉంటారు కానీ ఇలాంటివేవి చూడకుండా హీరోని మాత్రమే చూస్తూ ఎన్ని కోట్లయినా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనకాడని హీరో ఒకరు ఉన్నారు ఆ హీరో ఎవరు అంటే ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.
ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు అంటే ఎన్ని కోట్లు పెట్టినా నిర్మాతలు కంగారు పడాల్సిన పనిలేదు సినిమా ఫ్లాప్ అయినా పెట్టిన బడ్జెట్ మొత్తం వెనక్కి వస్తుందన్న నమ్మకం నిర్మాతలలో ఉంటుంది. అందుకే ప్రభాస్ సినిమాలు చేసే నిర్మాతలు ఏమాత్రం కంగారు పడరు.బాహుబలి తర్వాత ఆయన కెరీర్‌లో ఏ సినిమాలలైనా ఫలితాలు నెగటివ్ వచ్చినా, నిర్మాతలు మాత్రం అతని మీద ఉన్న నమ్మకాన్ని తగ్గించుకోలేదు.
ఎంతోమంది స్టార్ హీరోలే బడ్జెట్ కారణంగా సినిమాలను నిలిపి వేసుకుంటున్న తరుణంలో ప్రభాస్ సినిమాలకు మాత్రం వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇక ఈయన సినిమాలు దాదాపు 300 కోట్ల నుంచి 600 కోట్ల రేంజ్ లో తెరకెక్కుతూ ఉన్నాయి. ఇలా ప్రభాస్ పై నమ్మకంతో వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. అయితే ఈయన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా ఫ్లాప్ అయిన నిర్మాతలకు ఏమాత్రం నష్టం రాదు.
ప్రభాస్ సినిమాలు ఓపెనింగ్ వందల కోట్ల కలెక్షన్లను రాబడుతుంటాయి. అందుకే స్టార్ డైరెక్టర్ కాకపోయినా, కేవలం ప్రభాస్ ఉన్నాడన్న నమ్మకంతో నిర్మాతలు వందల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఇది ఇండస్ట్రీలో ఒక రేర్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈయన ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
