‎Prabhas: వామ్మో.. ఒక్క చెట్టు కోసం రూ. కోటి ఖర్చు చేసిన ప్రభాస్.. ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో తెలుసా?

‎Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మారుమోగుతున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. కాగా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకవైపు ఈ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కొత్త కొత్త సినిమాలను కమిట్ అవుతున్నారు ప్రభాస్.

‎కాగా ప్రభాస్ చివరగా కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఓజీ, సలార్ 2, స్పిరిట్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలలో నటించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే హీరో ప్రభాస్ ఒక చెట్టు కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారట. ఇంతకీ చెట్టు ఏది దాని ప్రత్యేకత ఏమిటి అన్న విషయానికి వస్తే..

‎ ఆ చెట్టు పేరు కల్పవృక్షం. హిందూ పురాణాలలో ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ చెట్టు కోరిక కోరికలు తీరుస్తుందని హిందువుల నమ్మకం. అయితే ప్రభాస్ కట్టిస్తున్న కొత్త ఇంట్లో ఈ కల్పవృక్షం చెట్టును ఏర్పాటు చేశారట. ఈ మొక్క ఖరీదు దాని వయసును బట్టి ఉంటుందట. అయితే ప్రభాస్ కొనుగోలు చేసిన ఈ కల్ప వృక్షం 100 ఏళ్ల నాటి మొక్క అని తెలుస్తోంది. ఈ మొక్క కోసం డార్లింగ్ ప్రభాస్ కోటి రూపాయల వరకు ఖర్చు చేశారట. అయితే ఇంతటి వయసు కలిగిన ఇంకొక కల్పవృక్షం కేవలం ముఖేష్ అంబానీ ఇంట్లో మాత్రమే ఉందట. ఇప్పుడు ఇదే విషయం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.