షాకింగ్ : ప్రభాస్ సినిమాకి ఈ రేంజ్ హైప్ ఉందా..!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా “ఆదిపురుష్” రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ గా దెబ్బ తిన్న సాహూ అలాగే రాధే శ్యామ్ లతో బాకీలు ఈ సినిమాతో తీర్చుకోవాలని వారు చూస్తుండగా సినిమా నుంచి వచ్చిన టీజర్ పెద్ద దెబ్బ అయ్యింది.

కానీ 3డిలో టీజర్ చూసాక మళ్ళీ కాస్త ఊపిరి పీల్చుకున్న అభిమానులు సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 కోసం  చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని అయితే చిత్ర యూనిట్ ఏకంగా పాన్ ఇండియా భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై అయితే ఒక్క మన ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ కూడా భారీ హైప్ ఉన్నట్టుగా ఇప్పుడు తెలిసింది. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ చెప్తున్నా దాని ప్రకారం వరల్డ్ వైడ్ గా గత 30 రోజుల్లో అత్యధికంగా వెతికిన టాపిక్స్ లో ఆదిపురుష్ 1850 శాతం రేటింగ్ తో నెంబర్ 1 గా నిలిచింది.

దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ కి ఈ రేంజ్ హైప్ ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి అయితే బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్ లు నటించారు.