జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభం అయింది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1926 ఓట్లు నమోదయ్యాయి. ఈసారి కరోనా రావడం వల్ల కరోనా సోకిన వాళ్లకు, నడవలేని వృద్ధులకు, ఇతర కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ను 1926 మంది ఉపయోగించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయితే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి రాగా.. ఎంఐఎం పార్టీ మూడో స్థానంలో ఉంది.
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కాగానే తొలి రౌండ్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అయింది. తొలి రౌండ్ ఫలితాలు కూడా త్వరలో వెల్లడి కానున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ దూసుకుపోవడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాసింత ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ దూకుడు చూసి బిత్తరపోతున్నట్టుగా తెలుస్తోంది.