Posani: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పోసాని… వెల్లడించిన వైద్యులు!

Posani: పోసాని కృష్ణమురళి అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఈయన చంద్రబాబు లోకేష్ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. అయితే ఈయనపై పలు ప్రాంతాలలో ఏపీలో కేసులు నమోదు కావడంతో పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి కట్టుబట్టలతో అరెస్టు చేసి తీసుకువచ్చారు.

ఇలా పోసాని అరెస్టుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భోజనం చేసి మందులు వేసుకుని వస్తానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఆయనకు టైం ఇవ్వలేదు ఇలా తనని అరెస్టు చేసి ఏపీకే తరలించారు. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకి తీసుకొచ్చిన పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేశారు.

పోసానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతానికి పోసాని హెల్త్‌ కండిషన్‌ నార్మల్‌గా ఉందని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. పోసానికి గుండెకు సంబంధించిన సమస్యలు ఉండడంతో ప్రస్తుతం ఆయన మందులు వాడుతున్నట్లు మెడికల్ ఆఫీసర్ రిపోర్ట్స్ ఇచ్చారు.

వైద్య పరీక్షల తర్వాత పోలీసుల విచారణకు పోసాని సిద్ధమయ్యారని మెడికల్‌ ఆఫీసర్‌ గురుమహేష్‌ వెల్లడించారు. ఈ విచారణ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరు పర్చబోతున్నారు. ఇలా పోసాని కోసం జగన్ ఇప్పటికే తన లాయర్ల అందరిని కూడా రంగంలోకి దింపారని తెలుస్తుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు హైకోర్టు లాయర్ బాల కూడా పోసాని అరెస్టుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు పోసానిని ఉంచిన ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసిపి నేతలు వాగ్వాదానికి దిగారు.