Posani: పోసాని ఆరోగ్యం పై పూనమ్ సంచలన ట్వీట్.. ఇక్కడ కూడా త్రివిక్రమ్ ను వదలలేదుగా?

Posani: సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈయన అరెస్ట్ అవ్వడానికి ముందు తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మందులు కూడా వాడుతున్నారని తదుపరి పరీక్షలు కూడా చేయించుకోవాలంటూ తన కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా పోలీసులు తనని బలవంతంగా అరెస్టు చేసి జైలుకు తరలించారు అయితే అరెస్టు చేసిన మరుసటి రోజు వరకు కూడా తనని అక్కడ ఇక్కడ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేశారు.

ఇలా ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అందుకు మందులు కూడా వాడుతున్నట్లు వైద్య పరీక్షలలో వెల్లడించారు అయినా పోలీసులు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా తనని జైలుకు పంపించారు అయితే జైలుకు వెళ్లిన తర్వాత కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోసాని ఆరోగ్యం గురించి నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు ఇతర రాష్ట్రాల కంటే చాలా దారుణంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకోవడంలో వ్యక్తులను ఎత్తుకెళ్లడం చాలా బాధాకరం. వ్యక్తిగతంగా నాకు భారీ నష్టం జరిగినప్పటికీ, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి అంటూ పూనం చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇక ఈమె మరొక ట్వీట్ కూడా చేస్తూ మధ్యలోకి త్రివిక్రమ్ శ్రీనివాసులు లాగారు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై సానుభూతి ప్రకటించిన పూనమ్ ఆయన తప్పు చేశారని చెప్పుకు వచ్చారు. పోసాని చేసిన మరో తప్పు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేయడమేనని పూనమ్ తెలిపారు. ఆయన గనక ఇండస్ట్రీలో లేకపోయి ఉంటే ఎంతో మంది జీవితాలు నాశనం కాకుండా బాగుపడేవి అంటూ ఈమె మరోసారి త్రివిక్రమ్ టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారు. అయితే గత కొంతకాలంగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ గురించి వివాదాస్పద పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.