Posani: పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఈయన పేరు ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో కూడా మారు మోగిపోతుంది. పోసాని కృష్ణమురళి వైసిపికి అనుకూలంగా ఉంటూ ప్రత్యర్థులైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా బూతులతో రెచ్చిపోయారు. ఇలా వైసిపికి మద్దతుగా ప్రత్యర్థులపై విమర్శలు చేయడంతో వైకాపా సైతం ఈయనకు ఉన్నత పదవిని కట్టబెట్టింది.
పోసాని సినీ నటుడు కావడంతో ఈయనని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించారు. అయితే ఈ పదవిలో ఉన్న పోసాని ఏనాడు కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేయలేదు ఈయనకు ఇలాంటి పదవి ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి రూపాయి కూడా ఆదాయం రాలేదు. పైగా ఈయనని ఈ పదవిలో కూర్చోబట్టి తనకు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా లక్షల్లో జీతాలు చెల్లిస్తూ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేశారని చెప్పాలి.
ఇలా పోసానికి వైకాపా ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పదవిలో కూర్చోబెట్టి ప్రత్యర్థులను తిట్టడం కోసం లక్షల్లో జీతం ఇచ్చిందనే చెప్పాలి. ఇదే విషయంపై ప్రస్తుతం కూటమి కార్యకర్తలు ఈ డబ్బు మొత్తాన్ని దుర్వినియోగం చేశారు కనుక తిరిగి ప్రభుత్వానికి పోసాని అయిన చెల్లించాలి లేదా వైకాపా పార్టీ అయినా డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్లు చేస్తున్నారు.
నామినేటెడ్ పోస్టులంటే, నో డౌట్.. అవి రాజకీయ నిరుద్యోగుల పునరావాస కార్యక్రమాలే. కానీ, వాటి నిమిత్తం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పోస్టుల ద్వారా వైసీపీ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం వల్లే రాష్ట్రం మొత్తం అప్పులు పాలు అయిందని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.