పూనమ్ పాండేపై దాడి.. భర్త సామ్ అరెస్ట్

హాట్ సెన్సేషన్ పూనమ్ పాండే ఆసుపత్రి పాలైంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు, ఫోటో షూట్లతో హీటెక్కించే పూనమ్ పాండేపై ఆమె భర్త సామ్ దారుణంగా దాడి చేయడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. భర్తపై పూనమ్ పాండే కేసు పెట్టడంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

గతంలోనూ పూనమ్ పాండే భర్తపై ఇలాగే కేసు పెట్టింది. పెళ్లయిన కొద్ది రోజులకే తనను భర్త వేధిస్తున్నాడంటూ, ఆయనపై కేసు పెట్టింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ సెట్ అవ్వడంతో, ఆ వెంటనే కేసు వాపస్ తీసుకుంది పూనమ్ పాండే.

మళ్లీ ఇప్పుడు ఆసుపత్రిలో చేరేంతలా గాయపరచడంతో, మరోసారి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది పూనమ్ పాండే. పూనమ్ పాండే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సామ్‌ని అరెస్టు చేశారు. అయితే, గతంలో తనపై జరిగిన దాడిని పూనమ్ పబ్లిసిటీ కోసం వాడుకుందని అంతా ఆమెను ఆడిపోసుకున్నారు. అలాగే, ఇప్పుడు కూడా పబ్లిసిటీ కోసమే పూనమ్ పాండే ఇంత ఇష్యూ చేస్తోందా.? అని నెటిజన్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.