చనిపోయానంటూ చెప్పి వార్తల్లో ఉండడం ఒక్క పూనమ్ పాండేకు మాత్రమే చెల్లింది. వివాదాస్పద నటి పూనమ్ పాండే చనిపోలేదని, బతికే వున్నానని ఒక ప్రకటనలో చెప్పింది. సర్వైకల్ క్యాన్సర్ తో పూనమ్ పాండే చనిపోయిందని ఒక పోస్ట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె అంత పెద్ద పేరున్న నటి కాకపోయినా, వివాదాలతో ఎక్కువగా వార్తలో వున్న నటి. ఆమె క్యాన్సర్ తో చనిపోయింది అనే వార్త విని కొంతమంది సెలెబ్రిటీలు సంతాపం తెలియచేసారు. ఈరోజు ఆమె మళ్ళీ నేను బతికున్నాను అంటూ ఇంకో పోస్ట్ పెట్టి, ఇదంతా సర్వైకల్ క్యాన్సర్ మీద ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అని చెప్పింది. ఆమె చేసిన పనికి నెటిజన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ఇదంతా ఒక చీప్ పబ్లిసిటీ అని నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన పెంచడం మంచిదే కానీ, ఇలా చీప్ పబ్లిసిటీ తో మాత్రం కాదు అని అంటున్నారు. పూనమ్ పాండే జీవితంలో ఇది కూడా ఇంకో వివాదంగా మిగిలి పోనుంది. ఆమెకి ఇప్పుడు సినిమా ఛాన్సులు లేవు, పేరు కూడా రావటం లేదు, అందుకని మళ్ళీ వైరల్ కావటానికి ఇదొక్కటే మార్గం అని ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ఎంచుకొని చనిపోయినట్టుగా నాటకం ఆడింది అని అంటున్నారు.
2011లో భారతదేశం ప్రపంచ క్రికెట్ కప్ ని గెలిస్తే తాను నగ్నంగా స్టేడియంలో తిరుగుతానని ప్రకటించింది. అప్పుడు ఆమె వార్తల్లో వుంది వివాదంగా మారింది. ఆ మరుసటి సంవత్సరం ఐపీల్ జట్టు కొలకత్తా నైట్ రైడర్స్ జట్టు ఐపీల్ ట్రోఫీని గెలుచుకుంటే, అప్పుడు పూనమ్ పాండే సామాజిక మాధ్యమంలో నగ్నంగా వున్న ఫోటో పెట్టి మళ్ళీ వివాదంలోకి ఎక్కింది.
తన వైవాహిక జీవితం గురించి కూడా వివాదం రేపింది. తాను డేటింగ్ చేసిన అబ్బాయినే పెళ్లిచేసుకుంది, పెళ్ళైన కొన్నిరోజులకే అతని మీద గృహ హింస నేరం పెట్టింది, మళ్ళీ అతనితో కలిసిపోయింది. తన పేరు మీద ఒక యాప్ ని విడుదల చేసింది, మళ్ళీ ఆ యాప్ ని డిలీట్ చేసింది. ఇలా ఎప్పుడూ వివాదంలో వుండే పూనమ్ పాండే ఈసారి ఈ సర్వైకల్ క్యాన్సర్ పేరుమీద చనిపోయినట్టుగా నిన్న లేదు బతికే వున్నాను అని ఈరోజు అంటూ ఇంకో వివాదం సృష్టించింది. ఇప్పటివరకు ఈమె జీవితం అంతా ఇలా వివాదాలతో సాగుతూ ఉండటం ఆశ్చర్యకరమైన అంశం.