బుట్టబొమ్మ పవర్ స్టార్‌కి ఫిక్సవ్వాల్సిందే!

Pooja Hegde To Romance Pawan Kalyan | Telugu Rajyam

పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాతో పవన్‌కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు, క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ కోసం అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇక ఆ తర్వాత పవన్ ప్రాజెక్టులో ఒకటైన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలోనూ హీరోయిన్ ఫిక్సయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించకపోయినా, బుట్ట బొమ్మ పూజా హెగ్దేనే తన సినిమాలో హీరోయిన్ అన్న సీక్రెట్‌ని కామ్‌గా రివీల్ చేసేశాడు దర్శకుడు హరీష్ శంకర్.

‘గద్దల కొండ గణేష్’ సినిమాలో పూజా కోసం డిఫరెంట్ రోల్ క్రియేట్ చేశాడు హరీష్ శంకర్. సూపర్ సక్సెస్ అయ్యింది ఆ పాత్ర. సినిమా కూడా. అలాగే, ఇప్పుడు పవర్ స్టార్ సినిమా కోసం కూడా పూజానే హీరోయిన్‌గా ఆయన ఫిక్సయిపోయాడట. హరీష్ అంతలా ఫిక్సయ్యాడంటే బుట్టబొమ్మ కోసం ఈ సారి ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేయనున్నాడో అనే క్యూరియాసిటీ నెలకొంది. కానీ, అదేంటో తెలియాంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం పూజా హెగ్దే, తెలుగుతో పాటు, తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ సినిమాలోనూ, హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలోనూ నటిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles