Nara Lokesh: నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి…. డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు?

Nara Lokesh: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అలాగే బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగాయి. ఇలా ఎన్నికలలో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఏకంగా 164 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే పొత్తులో భాగంగా ఓకే డిప్యూటీ సీఎం ఉండాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా పవన్ చంద్రబాబు ఇద్దరు కూడా వారి విధులను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అయితే ఇటీవల కూటమి పార్టీలలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు డిప్యూటీ సీఎం పదవిని కూడా నారా లోకేష్ కే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మైదుకూరు బహిరంగ సభ వేదిక మీద నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబునాయుడు కోరడం సంచలనం రేపుతోంది.

ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి వేదికపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మూడో వారసులు అయినటువంటి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కనుక ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాసేన రాజేష్‌ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి విదితమే. కాగా తాజాగా చంద్రబాబు ముందు లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరాటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.

మరి ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నారా లోకేష్ కి కనక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఈయనకు ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారనే విషయంపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి ఈ విషయంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ స్పందన ఏంటి అనేది తెలియాలి.