గత కొన్ని రోజులుగా ఏపీ హైకోర్టు నుంచి వెలువడుతున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. కొన్ని కేసులకు సంబంధించిన తీర్పులను మీడియాలో కూడా రావొద్దంటూ హెచ్చరించింది. అది నేషనల్ లేవల్ లోనే చర్చనీయాంశమైంది.
ఇలా చాలా తీర్పులపై ఏపీ హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వం పాటించిన విధానాలపై ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం సమీక్షలు గట్రా చేయకూడదంటూ హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది.
అంతే కాదు.. గత ప్రభుత్వ విధానాలే ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగించాలని చెప్పడం కూడా పెద్ద డిబేట్ అయింది. ఒకవేళ గత ప్రభుత్వ విధానాలను మార్చాలనుకుంటే… అది అన్ని విషయాల్లో సాధ్యం కాదని.. ప్రత్యేక పరిస్థితుల్లోనే గత ప్రభుత్వ విధానాలను మార్చాలని చెప్పడం కూడా పెద్ద చర్చకు దారితీసింది.
అయితే.. వీటిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు.. పాత ప్రభుత్వం విధానాలనే కొత్త ప్రభుత్వం అవలంభించాలంటే.. అసలు కొత్త ముఖ్యమంత్రి ఎందుకు? కొత్త కేబినేట్ ఎందుకు? అసలు ఈ ఎన్నికలు ఎందుకు అని చెబుతున్నారు.
గత ప్రభుత్వాలు సరిగ్గా పాలన చేయకపోతేనే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. గత ప్రభుత్వం విధానాలు విఫలం అయితేనే కదా.. ప్రజలు వేరే వాళ్లను ఎన్నుకునేది.. అటువంటప్పుడు ఆ ప్రభుత్వ విధానాలనే అమలు చేసేటట్టయితే.. అసలు కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం దేనికి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆలోచన వేరే ఉంటుంది.. గత ప్రభుత్వ ఆలోచన వేరే ఉంటుంది. కొత్త ప్రభుత్వం తన సొంత విధానాలను రూపొందించుకోవడమే కాదు.. గత ప్రభుత్వాల విధానాలను కొనసాగించడం.. కొనసాగించకపోవడం అనేది దాని చేతుల్లోనే ఉంటుంది.. అని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాత విధానాలనే కొనసాగించాలంటే సీఎంగా జగన్ మాత్రం ఎందుకు? చంద్రబాబునే ఉంచితే బెటర్ కదా? అనే వార్తలు ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్నాయి.
అయినా… ప్రభుత్వ విధివిధానాల రూపకల్పనలో న్యాయ వ్యవస్థ కల్పించుకోవడం కరెక్ట్ కాదు.. అని వైసీపీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నారు. న్యాయ వ్యవస్థ వేరు.. శాసన వ్యవస్థ వేరు. శాసన వ్యవస్థ విధానాలను శాసనసభ నిర్ణయించుకుంటుంది కానీ న్యాయ వ్యవస్థ కాదు.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.