సినీ నిర్మాత, వైకాపా నేత పీవీపీ ఇటీవలే బంజారాహిల్స్ లోని తన ఇంటిపక్కనే ఉన్న కైలాష్ అనే వ్యక్తి తో వివాదం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కైలాష్ ఇంటి విస్తరణ పనులకు అడ్డు తగిలిన నేపథ్యంలో పీవీపీ గుడాయిజం చేయడంతో కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆరెస్ట్ కు రంగం సిద్దం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించిన వెళ్లకుండా తప్పించుకున్నారు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. తాజాగా సోమవారం పోలీసులు బంజారాహిల్స్ లోని పీవీపీ ఇంటికి అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్లపై ఏకంగా కుక్కల్నే వదిలారు. దీంతో బెదిరిపోయిన పోలీసులు ఇంటి సమీపం వరకూ వెళ్లి వెనుదిరిగారు.
ఈ నేపథ్యంలో పీవీపీ పై పోలీస్ యాక్షన్ మరింత సీరియస్ అయింది. బంజారాహిల్స్ ఎస్ . ఐ హరీష్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పీవీపీ పై ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. ఐపీసీ 353 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ వివాదం పీవీపీ పై మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ట్వీటర్ వేదికగా నీతులు…సూక్తులు వల్లించిన పీవీపీ తాజా వ్యవహారంతో అడ్డంగా దొరికిపోయాడు. కైలాష్ ఫిర్యాదు మరింత బలపడింది. అతనిపై పీవీపీ దౌర్జన్యం నిజమే అయి ఉంటుందని కేసు బలపడుతోంది. ఇప్పుడు ఏకంగా పోలీసులపై నే పీవీపీ తన ప్రతాపాన్ని చూపించడంతో పోలీసులు అతనిపై సీరియస్ గా ఉన్నారు.
పీవీపీ ని ఎలాగైన పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని…కోర్టు మెట్లు ఎక్కించి చట్టం దెబ్బ రుచి చూపించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పీవీపీ వ్యవహారంపై పోలీస్ ఉన్నత స్థాయి అధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి పీవీపీ భేలే ఇరుక్కుపోయాడు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. చిన్న విషయంపై రచ్చ చేసి ఏకంగా చట్టంతోనే పెట్టుకున్నాడు. కైలాష్ విషయం ఎలా ఉన్నా….పోలీసులపైకి కుక్కల్ని వదలడం అంటే పీవీపీ కేసు బలంగానే ఉంటుందని తెలుస్తోంది.