గత కొన్నిరోజులుగా మతాలపై, కులాలపై, దేవుళ్లపై నడుస్తున్న రాజకీయాలు ఇప్పుడు విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఉన్న రాముని సాక్షిగా ఆ గొడవలు ఇప్పుడు తీవ్రస్థాయి చేరుకున్నాయి. అక్కడ జరిగిన సంఘటనను పరిష్కరించాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా లేదు. ఎవరికి వారు ఆ విషయాన్ని రాజకీయం చేసి లబ్ది పొందటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే మొదట నిన్న ఆలయంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఆలయాన్ని పరిశీలనకు వెళ్లతున్నట్లు ప్రకించిన వెంటనే.., వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు కంటే ముందే రామతీర్థం చేరుకున్న ఆయన, కొండెక్కి ఆలయాన్ని దర్శించారు. విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
అయితే ఈ ఘటనపై భద్రత అధికారాలు డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. విజయ సాయి రెడ్డి కాన్వాయ్ పై దాడికి పాల్పడిన వారిని వీలైన్నంత త్వరగా అరెస్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ మత రాజకీయాలు, దేవుళ్ళ రాజకీయాలు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది వేచి చూడాలి.