Crime News: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురు నిందితుల అరెస్ట్..!

Crime News: ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పులు తెలంగాణలో తీవ్ర కలకలం రేపాయ. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.పోలీసులు ఈ కేసును రెండు రోజుల వ్యవధిలోనే సమయస్ఫూర్తితో ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి అను ఇద్దరు వ్యక్తులను ఇబ్రహీంపట్నం కర్ణగూడ వద్ద దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. శ్రీనివాస్ రెడ్డి ఇ అక్కడికక్కడే మృతి చెందగా రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనలో ఇరు కుటుంబ సభ్యులు మట్టా రెడ్డి మీద అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.సపారీ గ్యాంగ్ సాయంతో మట్టారెడ్డి ఈ హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మట్టారెడ్డితో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. భూ వివాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు వెల్లడించారు.

రాఘవేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ కలిసి ఇబ్రహీంపట్నం లో రెండు నెలల క్రితం పది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కానీ ఆ భూమి తనదే అంటూ మట్టా రెడ్డి భూమిని కబ్జా చేశాడు. ఈ విషయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రెండు రోజుల క్రితం శ్రీనివాస్ రెడ్డి సైట్ దగ్గరికి వెళ్లగా అక్కడే ఉన్న మట్టా రెడ్డి శ్రీనివాస్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు . ఈ క్రమంలో మంగళవారం ఉదయం మట్టా రెడ్డి అనుచరులు శ్రీనివాస్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి పై కాల్పులు జరిపారు. మట్టా రెడ్డి సుపారీ గ్యాంగ్ సహాయంతో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.