మహేష్ బర్త్ డే స్పెషల్.. మరోసారి విడుదల కానున్న పోకిరి?

Mahesh Babu

మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు ఇలియానా జంటగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్ కు పూరి జగన్నాథ్ టేకింగ్ అద్భుతంగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి.ఈ విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా నిలిచిన పోకిరి సినిమాను మహేష్ బాబు పండుగాడు పాత్రలో సందడి చేశారు.

ఈ సినిమాలో ఇలియానా సైతం తన అందచందాలతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.ఈ సినిమా విడుదలై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ టెలివిజన్లో ప్రసారమైన ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు.అయితే ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించిన ఈ సినిమా మరోసారి థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఆగస్టు 9వ తేదీ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను పలు థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా పోస్టర్ విడుదల చేశారు.క్లైమాక్స్ లో మహేష్‌ పరిగెత్తుకుంటూ వస్తోన్న లుక్ ని రిలీజ్‌ చేయగా, ఆలుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఇలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై తిరిగి మరోసారి థియేటర్లో ఈ సినిమా విడుదల కావడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.