ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు ఎంతలా కృషి చేస్తున్నారో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగి పార్టీని బలపరచడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా అయిన కడపలోనే ప్రధాని మోడీ సరికొత్త రాజకీయ మొదలు పెట్టారని సమాచారం. ఇక్కడ అభివృద్ధిపై మోడీ ప్రత్యేక శ్రద్ద పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అధికారులు చెబుతున్న మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల కడప జిల్లాలకు కొందరు కేంద్రం నుంచి అధికారులు వచ్చి రహస్యంగా సమాచారం సేకరించి వెళ్లినట్టు తాజాగా తెలుస్తోంది.
కడప అభివృద్దే కీలకం
నిజానికి ఒక రాష్ట్ర సీఎం సొంత జిల్లా వ్యవహారాలను కేంద్రం సేకరించడం, పరిశీలించడం అనేది ఇదే ప్రథమం. పైగా తమకు సంబంధం లేని పార్టీ ప్రభుత్వం ఉన్న ఏపీలో ఇలా జరగడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కడప బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఈ జిల్లాను మోడల్ జిల్లాగా మార్చడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మోడల్ డిస్ట్రిక్ట్ గా మార్చడం కోసమే మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని బీజేపీ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రాయోజిత కార్యక్రమాలకు కడప జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా కడపను తీర్చిదిద్దడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు సంస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
వైసీపీకి దెబ్బపడుతుందా!
సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాక.. తన జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడి రైతులు, ఇతర వృత్తుల వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం దిశగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పులివెందులను గ్రేటర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కడపను మోడీ కూడా తన అడ్డాగా మార్చుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల కడపలో జగన్ క్రేజ్ కు రానున్న రోజుల్లో దెబ్బపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ విషయం బీజేపీకి కలిసి వస్తే ప్రజల్లో జగన్ పై అభిమానం తగ్గి మోడీకి చేరువ అవుతారేమోనని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం జగన్ ఇప్పుడు ఏపీ దెబ్బకొట్టడం ఎవ్వరి వల్ల కాదు అది కడపలో అయితే మరి అసాధ్యమని చెప్తున్నారు.