ఇన్ని రోజులు వేరు.. ఇప్పుడు వేరు.. రాబోయే రోజులన్నీ కీలకమైనవి. అందులోనూ వరుసగా పండుగలు రాబోతున్నాయి. నవరాత్రులు కూడా మొదలయ్యాయి. నవరాత్రుల తర్వాత దసరా, దివాళీ, ఈద్, క్రిస్ మస్ లాంటి పండుగలు రానున్నాయి. కాబట్టి.. ఈ సమయంలోనే ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయమే చాలా కీలకమైనది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే ఉండాలి. కోవిడ్ కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించారు. చిన్న నిర్లక్ష్యం చేసినా.. అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. అందుకే.. దేశం నుంచి కరోనా ఇంకా పోలేదు అనే విషయాన్ని అస్సలు మరిచిపోకండి.. అంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు.
ఇవాళ సాయంత్రం 6 గంటలకు మీఅందరికీ ఓ విషయం చెప్పబోతున్నా.. అంటూ ప్రధాని మోదీ మధ్యాహ్నం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాయంత్రం 6 గంటలకు ప్రధాని 13 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఆ వీడియో ప్రధాని మోదీ.. ప్రధానంగా కరోనా వైరస్ గురించే మాట్లాడారు. దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిందన్నారు. రికవరీ రేటు కూడా విపరీతంగా పెరిగిందన్నారు.
అతి త్వరలోనే దేశంలోకి కరోనా వ్యాక్సిన్ రాబోతున్నదని.. అప్పటి వరకు ప్రజలంతా ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితువు పలికారు.
ఇప్పటి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని కరోనాను జయిస్తూ వచ్చాం. ఇంకొన్ని రోజులు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తే.. కరోనాను దేశం నుంచి అతి త్వరగా తరిమికొట్టొచ్చు. దానికి మీ సహకారం కావాలి. ఇప్పటికే డాక్టర్లు, ఇతర సిబ్బంది కరోనా రోగులకు ఎంతో సేవ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే కరోనాను త్వరలోనే మనం జయిస్తాం.. అని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Sharing a message with my fellow Indians. https://t.co/tNsiPuEUP3
— Narendra Modi (@narendramodi) October 20, 2020