నరేంద్ర మోదీ.. దేశానికి ప్రధాని. కానీ ఆయన దగ్గర ఉన్న నగదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు. ఈరోజుల్లో చోటా మోటా లీడర్ దగ్గరే లక్షల కొద్దీ డబ్బు ఉంటుంది. కోట్ల లావాదేవీలు చేస్తారు. కానీ.. దేశానికి ప్రధాని.. ఆయన దగ్గర ఎంత డబ్బు ఉండాలి. కానీ.. ఆయన దగ్గర ప్రస్తుతం ఉన్న నగదు కేవలం 31,450 రూపాయలు.
ప్రధాని మోదీ.. తాజాగా ఆయన ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన దగ్గర ఉన్న నగదు వివరాలను తెలిపారు. ఆయనకు గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఒక ఇల్లు, కొంచెం స్థలం ఉన్నాయి. దాని విలువ 1.1 కోట్లు.
ఇక.. ప్రధాని మోదీ ముఖ్యమైన ఆదాయ వనరు.. తనకు వచ్చే జీతం 2 లక్షలు. ప్రధానిగా ఆయనకు వచ్చే రెండు లక్షల జీతాన్నే ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుంటారు మోదీ. వాటిపై వచ్చే వడ్డీని తిరిగి ఇన్వెస్ట్ మెంట్లలో పెడుతుంటారు మోదీ.
ఇక.. ఆయన సేవింగ్స్ అకౌంట్ లో 3.38 లక్షల నగదు ఉండగా… ఫిక్స్ డ్ డిపాజిట్లుగా 1.6 కోట్లు ఉన్నాయి. మోదీ తన జీతాన్ని ఎక్కువగా ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనకు గాంధీ నగర్ లోని ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ లోనే అన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లు వేస్తారు మోదీ.
ఎన్నికల సమయంలో మోదీ మొత్తం ఆస్తుల విలువ 1.3 కోట్లు కాగా.. ప్రస్తుతం అంటే ఈసంవత్సరం జూన్ నాటికి 1.7 కోట్లుగా ఉంది. గత ఎన్నికల సమయంలో మోదీ వెల్లడించిన ఫిక్స్ డ్ డిపాజిట్లకు.. ఇప్పటికి చూసుకుంటే… 33 లక్షల డిపాజిట్లు పెరిగాయి.