జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ చేసిన పనికి ఎలాంటి వ్యాఖ్యలు చేసాడో తెలిసిందే. పాచిపోయిన లడ్డూలు తెచ్చారంటూ ప్రధానిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తర్వాత స్వరం మార్చి పవన్ బీజేపీ పంచన చేరి బాకా కొట్టడం విధితమే. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి కనీసం ఒకసీటు గెలుచుకోలేకపోవడంతో పవన్ వైఖరి పూర్తిగా మార్చేసాడు. తన పుస్తకాల నాలెడ్జ్ ని పక్కనబెట్టేసి విపక్ష నేత చంద్రబాబు నాయుడతో కలిసి అధికార పక్షంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నాడు. అయిందానికి..కానిదానికి వైకాపా ప్రభుత్వంపై ఆరోపణలే జనసేన పార్టీ ఎజెండాగా మార్చేసినట్లు నడుచుకుంటున్నాడు.
ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటోన్న పరిస్థితులపై పవన్ అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ అనుభవం ఏమాత్రం లేనివాడిగా నడుచుకుంటున్నాడు. కరోనా వైరస్ తో కలిసి బ్రతకాలని సాక్షాత్తు దేశ ప్రధాని ఉద్ఘాటించినా పవన్ వైరస్ పై చిల్లర కామెంట్లు మాత్రం మానడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కరోనాతో కలిసి బ్రతికుతున్నట్లే విశాఖలో స్టైరీన్ గ్యాస్ తో కలిసి బ్రతకాలా? అని అధికార పక్షాన్ని విమర్శించాడు. ఇంకా ప్రభుత్వ భూములు అమ్మకంపై, ఇంగ్లీష్ మీడియం విద్యపై పవన్ మరోసానరి తన గళాని వినిపించే ప్రయత్నం చేసాడు. దీంతో వైకపా నేతలు సీన్ లోకి ఎంటర్ అయ్యారు.
పవన్ వ్యాఖ్యలకు కౌంటర్లు వేయడం మొదలు పెట్టారు. కరోనా వైరస్ కి…స్టైరీన్ గ్యాస్ కి తేడా తెలియదా? ప‌్రభుత్వ భూములు అమ్మి పేదలకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించాం. కుల, మత, ప్రాంత బేధం లేకుండా ఎస్ , ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అంటూ తేడా లేకుండా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆ మాత్రం కూడా తెలియకుండా పవన్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే వలస కార్మికుల పట్ల జగన్ ఎలాంటి వైఖరితో ఉన్నారో స్పష్టంగా ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు. దానిపైనా రాజకీయాలు చేయడం, సినిమాల్లో నీతులు చెప్పిన పవన్..నిజ జీవితంలో నీతులు మాట్లాడం రాదా? అంటూ ఎద్దేవా చేసారు. ఇకనైనా పవన్ పాచిపోయిన మాటలు మానుకోవాలని ధ్వజమెత్తారు.