PK Sketch : పీకే స్కెచ్: కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందా.?

PK Sketch

PK Sketch : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయనున్నాడన్న వార్త తెలుగు నాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రశాంత్ కిషోర్ లెక్కలు వేరేలా వుంటాయ్.

తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పని చేస్తున్నారు.. అదే సమయంలో వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కూడా సేవలందింస్తున్నారు ప్రశాంత్ కిషోర్.

మరి, కాంగ్రెస్ పార్టీలో ఎలా ప్రశాంత్ కిషోర్ చేరతారు.? అంటే, దానికి చాలా పెద్ద లెక్క వుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠమెక్కించాలంటే, బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఒక్కతాటిపైకి తేవాల్సి వుంటుందని ప్రశాంత్ కిషోర్‌కి తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ తనదైన వ్యూహాల్ని రచిస్తున్నారు.

అంతా బాగానే వుందిగానీ, ఎన్నికల వ్యూహకర్త అయినంత మాత్రాన ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు వైఎస్ జగన్ ఆడతారా.? అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్న వైరం చిన్నది కాదు.. చాలా చాలా పెద్దది.

తెలంగాణలో టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య వైరం కూడా చిన్నది కాదు. సో, ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే పరిస్థితి లేదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకుంటేనే, కేంద్రంలో ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ప్రశాంత్ కిషోర్‌కి కూడా తెలుసు.

సో, ప్రశాంత్ కిషోర్ ఎలా వైఎస్ జగన్ అలాగే కేసీయార్‌ని కాంగ్రస్‌తో కలిసేందుకు ఒప్పిస్తారన్నది వేచి చూడాల్సిందే.