Pithapuram Varma: టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలు వర్మ… గట్టి షాక్ ఇవ్వబోతున్నారుగా?

Pithapuram Varma: పిఠాపురం నియోజకవర్గం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తూ వర్మ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా ఈయన గెలిచారు. అయితే 2024 ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యేగా టికెట్ పొందుతారని ఎంతో ఆశించి ఈయన పార్టీ ఓడిపోయిన పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ పని చేశారు అయితే చివరి నిమిషంలో మాత్రం వర్మకు చంద్రబాబు నుంచి నిరాశ ఎదురయింది.

వర్మ స్థానంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికలలో పోటీ చేశారు అయితే వర్మకు తర్వాత ఎమ్మెల్సీ, మినిస్ట్రీ ఇస్తామని చెప్పడంతోనే ఆయన కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ పవన్ విజయానికి కారణమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పిఠాపురంలో వర్మను పూర్తిగా పక్కన పెట్టారని తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో నాగబాబు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరి దయ వల్ల గెలవలేదని తనకున్నటువంటి క్రేజ్ కారణంగానే గెలిచారు అంటూ చెప్పుకు వచ్చారు.

నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల టిడిపి వర్గీయులు ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అక్కడ వర్మకు ప్రాధాన్యత ఇస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయపరంగా ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతో ఎక్కడికక్కడ వర్మకు అడ్డుకట్టు వేస్తూ వస్తున్నారు. ఇకపోతే మరో 15 సంవత్సరాలు పాటు కూటమి ఇలాగే కొనసాగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యల కారణంగా వర్మ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలింది.

మరో 15 సంవత్సరాలు కూటమిలాగే కొనసాగుతుందని పవన్ చెప్పడంతో తనకు తదుపరి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన వర్మ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈయన పిఠాపురంలోనే మరోసారి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే వర్మ రాజీనామా చేయబోతున్నారా? ఒకవేళ రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి రాబోతున్నారు అనేది సందిగ్ధంగా మారింది.