జగన్ సర్కార్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి! అన్న అంశం మరోమారు తెరపైకి వచ్చింది. వైకాపా పార్టీకి సంబంధించిన అధ్యక్ష బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారు? అన్న దానిపై ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవికి సంబంధించి కీలక నేతల పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి సహా సహా పలువురి సీనియర్ నేతల పేర్లు వినిపించాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలు పూర్తియిన నేపథ్యం లో వైకాపా నుంచి పార్లమెంటరీ పార్టీ పదవి బాధ్యతల విషయంలో కొత్త పేరు తెరపైకి వస్తోంది. శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగు స్థానాల్లోనూ మళ్లీ వైకాపా అభ్యర్ధులు గెలుపు ఖాయం చేసుకున్నారు.
Read More : వైసీపీ కేడర్, నేతల నుండి రక్షణ కల్పించమని ఎస్పీని కోరిన రాఘురామరాజు
దీంతో రాజ్యసభలో వైకాపా సభ్యుల సంఖ్య 6కు చేరుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గబోతుంది! అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కొన్నాళ్లుగా విజయసాయి పార్టీమెంటరీ పార్టీ పదవిలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో విశాఖ ఎల్ జి పాలిమర్స్ ఘటన నేపథ్యంలో విశాఖ వెళ్తున్నప్పుడు సీఎం జగన్ ..ఎక్కించుకున్న కారులోంచి విజయసాయిని దించేయడం ఏపీ రాజకీయాలలో ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. చివరికి విజయసాయి తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటానని చెప్పేంత వరకూ సన్నివేశం వచ్చిందంటే? విజయసాయి నిజంగానే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
Read More : ఫాదర్స్ డే: తండ్రిపై సీఎం జగన్ భావోద్వేగ పోస్ట్
విజయసాయి చేసిన ఆ వ్యాఖ్యలు పొలిటికల్ ఎనలిస్టుల్లో చర్చకు దారి తీసాయి. అయితే ఏపీలో ఏ పార్టీ విజయ సాధించాలన్నా బీసీ ఓటులు కీలకం. కాబట్టి జగన్ ఇప్పుడు మరోసారి పార్టీలో దళితుల బలం పేంచే పనిలో పడ్డట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ పదవి నుంచి విజయసాయిని తప్పించి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాస్ చంద్రబోస్ కు ఆ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని తొలి నుంచి జగన్ సర్కార్ విమర్శలు మోస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అపవాదును చెరుపుకోవాలని జగన్ బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ని సీన్ లోకి తీసుకొస్తున్నట్లు వినిపిస్తోంది.
Read More : యంగ్ సీఎం జగన్ స్ఫూర్తితో విజయ్ రాజకీయాల్లోకి!