నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ పదవి నుంచి తొలగిస్తూ ఏప్రీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో, పిటీషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం ఫరిదిలో ఉంది. తొలిధపా విచారణలో తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగానే ఉంది. అయితే తుది తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తాజాగా మరో పిటీషన్ దాఖలు చేసారు.
ప్రభుత్వ సీఎస్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే నిమ్మగడ్డ ఉన్న పళంగా మళ్లీ హైకోర్టులో పిటీషన్ వేయడం అంతటా చర్చకొస్తుంది. పైగా నిమ్మగడ్డ బీజీపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీ నేత కామినేని శ్రీనివాసరావులతో ఈనెల 13 పార్క్ హయత్ లో భేటీ అయినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనిపై రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీలో నిమ్మగడ్డ వ్యవహారమే ముగ్గురు చర్చించి ఉంటారని, సుప్రీంకోర్టులో న్యాయపరంగా వెళ్లడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి సంబంధించి ప్రధానంగా చర్చించి ఉంటారని మీడియాలో హైలైట్ అవుతోంది.
ఇంతలో నిమ్మగడ్డ హైకోర్టులో జగన్ సర్కార్ పై కోర్టు ధిక్కరణ కింద పిటీషన్ దాఖలు చేయడం అన్ని రాజకీయ పార్టీలో చర్చకొస్తుంది. ఇప్పటికే ఆ ముగ్గురి భేటీపై వైకాపా నేతలు తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ భేటీకి అసలు కారకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని, నిమ్మగడ్డని పావులా ప్రభుత్వం మీదుకు వదలుతున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై వైకాపా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడానికి రంగం సిద్దం చేస్తోంది.