AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికలలో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీ బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నెలలపాటు ఎంతో సాన్నిహితంగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా కూటమి నేతల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని వార్తలు వినపడుతున్నాయి.
ఇకపోతే తాజాగా జనసేన ఎమ్మెల్యేలు తమ అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఒక హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారని తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఇద్దరు మంత్రులు మినహా అందరూ ఇక్కడ హాజరైనట్టు తెలుస్తోంది.
ఇలా మంత్రులు పవన్ కళ్యాణ్ కాకుండా కేవలం మంత్రి నాదెండ్ల మనోహర్ తో మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా భేటీ కావడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇలా ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవ్వడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. అయితే ఎమ్మెల్యే లందరూ కూడా నాదెండ్ల మనోహర్ వద్ద తమ బాధను బయట పెట్టుకున్నారని తెలుస్తుంది.
పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చినప్పటికీ తమకంటూ ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యేలు తమ బాధను బయట పెట్టుకున్నారని తెలుస్తోంది. తాము గెలిచిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయినప్పటికీ అక్కడ పెత్తనం మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇన్చార్జిలదేనని ఆవేదన చెందారట. అధికారుల సైతం ఇన్చార్జి లకు ఇచ్చిన ప్రాధాన్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదని మంత్రి మనోహర్ వద్ద తమ బాధను బయటపెట్టారు.
ఇలా ఈ విషయంలో కనుక చర్యలు తీసుకోకపోతే మాకంటూ ఎలాంటి విలువలు ఉండవని ఈ విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ భేటీ గురించి పవన్ కళ్యాణ్ కు తెలుసని కొంతమంది భావిస్తున్నారు కానీ అయితే ఈ భేటీ గురించి ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడటానికి మాత్రం వెనకడుగు వేస్తుండడంతో ఈ రహస్య భేటీ వెనుక గల కారణం ఏంటనే చర్చలు మొదలయ్యాయి.