AP: వైసీపీ వారికి చిన్న పని చేసిన ఊరుకోను… సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

AP: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో పాల్గొన్నారు అక్కడ స్వయంగా చంద్రబాబు నాయుడు కొంతమందికి పెన్షన్ అందజేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ప్రభుత్వాధికారులు కానీ నేతలు కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు లేదా కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ప్రత్యక్ష సహాయం అలాగే పరోక్ష సహాయం కూడా చేయకూడదు అంటూ ఈయన బహిరంగ సభలో తెలియజేశారు. ఇలా ఒక్కసారిగా వైసీపీ వారికి ఎలాంటి పనులు చేయొద్దు అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటంతో ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరూ తనవారనీ భావించకుండా ఓ వర్గానికి పనులు చేసి పెట్టద్దు అంటూ చెప్పడం ఎంత నీచాతి నీచమో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గతంలో జగన్ చెప్పిన వీడియోని కూడా జతపరుస్తూ ఇద్దరి నాయకులకు తేడాలను గమనించాలని కోరుతున్నారు.

గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం గురించి మాట్లాడుతూ రాజకీయం అనేది కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా మనవారేనని జగన్ తెలిపారు. మనం చెప్పిన ఈ మేనిఫెస్టో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేరాలని ఆయన తెలిపారు. నాకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే ఆ పథకం అందాల్సిందేనని జగన్ తెలిపారు..

ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప నాయకుడిగా కులం చూడం మతం చూడం పార్టీ చూడడం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందాల్సిందేనని చెప్పారు కానీ చంద్రబాబు మాత్రం వైసిపి వారికి పనులే చేయొద్దు అని చెప్పడంతో ఇక్కడ ఎవరు ప్రజానాయకుడు ఎవరు స్వార్ధపరులు అనేది స్పష్టం అవుతుంది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఈ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు.