TG: ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామస్మరణ వినిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్వయంగా కాంగ్రెస్ నేతలే జై జగన్ అంటూ నినాదాలు చేయడంతో ముఖ్యమంత్రికి ఊహించని షాక్ అని చెప్పాలి.
తాజాగా టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ విస్తృతస్థాయి సమావేశాలలో భాగంగా పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో భాగంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం… అలాంటి అంశాలను ఎజెండాగా పెట్టుకొని టిపిసిసి విస్తృతస్థాయి కార్యవర్గం సమావేశం అయింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కూడా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తూ మాట్లాడారు.
ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన అద్భుతాలను… విజయాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి కచ్చితంగా న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతోమంది అహర్నిశలు కృషి చేస్తున్నారని వారందరికీ న్యాయం చేయాలని కోరుతూ చివరిలో జై జగన్ అంటూ నినాదం చేశారు.
ఇలా బెల్లయ్య నాయక్ జై జగన్ అంటూ నినాదాలు చేయటంతో ఒక్కసారిగా అక్కడున్న కాంగ్రెస్ నేతలు అందరూ కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన వైసీపీ ఫ్యాన్స్ దట్ ఇస్ జగన్ క్రేజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.