ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై, ప్రభుత్వం చేస్తున్న పనులపై, చెయ్యాల్సిన పనులపై, ప్రతి పక్షాల పాత్రపై తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. అలాగే గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం అనగానే మళ్ళీ వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారోనని మీడియా వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
ఉండవల్లి టీడీపీనా!! వైసీపీనా!!
ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది.కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ప్రభుత్వం గనుక ఫాలో అయితే వైసీపీకే చాలమంచిది. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆయన తమకు ఎప్పటికి ప్రతిపక్షమేనని చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆయన టీడీపీ అనుకుందామంటే టీడీపీ నాయకులు కూడా ఆయన తమ పార్టీ కాదని, ఆయన వైసీపీ మద్దతుదారుడేనని చెప్తున్నారు. ఇలా ఆయన రాజకీయంగా తన అభిప్రాయాలను చెప్తున్నారు కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తని ఎవ్వరికి అర్ధం కావడం లేదు.
ఉండవల్లి వ్యాఖ్యలను ఎవరైనా న్పట్టించుకుంటారా!!
ఉండవల్లి అరుణ కుమార్ మీడియా సమావేశంపై మీడియా వర్గాలకు తప్పా సామాన్య ప్రజలకు అస్సలు ఆసక్తి ఉండటం లేదని, వాళ్ళు అస్సలు ఈయనను పట్టించుకోవడం మనేశారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ఆయన గతంలో రెండుసార్లు ఎంపీగా చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఎలాంటి అధికారం లేకుండా సామాన్యుడిగా చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.