పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా కూడ ఆయన క్రేజ్, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్, అభిమానులు ఇలా అన్ని చోట్లా ఆయన ఛరీష్మా పదిలంగానే ఉంది. అందుకే ఆయనకు ఆడినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడట్లేదు. ప్రజెంట్ పవన్ ఒక్కొక సినిమాకు 50 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 50 కోట్ల డీల్ కాకపోతే రోజులు కోటి చొప్పున ఎన్ని రోజులు సినిమాకు పనిచేస్తే అన్ని కోట్లు ఇవ్వాలనే డీల్ కూడ ఉందట. ఈ రెండింటిలో ఏది కావాలో నిర్మాతలే డిసైడ్ అవుతున్నారు.
పవన్ లేటెస్ట్ ఫిలిం ‘వకీల్ సాబ్’ కోసం నిర్మాత దిల్ రాజు ఏకంగా 65 కోట్లు చెల్లించారట. ఈ సినిమాకు 50 కోట్ల రెమ్యునరేషన్ ప్లస్ లాభాల్లో వాటా అనే డీల్ చేసుకున్నారట. అందుకే దిల్ రాజు ముందుగా 50 కోట్లు ముట్టజెప్పారట. ఇక పవన్ పేరు మీద బిజినెస్ గట్టిగానే జరిగి దిల్ రాజుకు మంచి లాభాలే వచ్చాయి. ఆ లాభాల నుండి పవన్ వాటా కింద ఇంకో 15 కోట్లు చెల్లించారట దిల్ రాజు. ఇలా ‘వకీల్ సాబ్’ సినిమాకుగాను పవన్ అందుకుంది అక్షరాలా 65 కోట్లు. ఇదే కాదు ప్రతి సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ప్లస్ బిజినెస్ లాభాల్లో వాటా అనే ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్.