Pawan kalyan : పవన్ కళ్యాణ్ ‘ఎర’ ట్వీటు ప్రకటపనలు: వేటగాడెవరు.?

Pawan kalyan : ప్రజాస్వామ్యంలో ప్రజలే ‘ఆశపడే స్థితలో వున్న జాతి’, వేటగాళ్ళు ఇంకెవరో కాదు రాజకీయ నాయకులు, పార్టీలు. ఇంతకీ ‘ఎర’ ఏంటి.? ఇంకేముంటుంది.? ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

నిజానికి, ఇక్కడ ఓటర్లను అవమానపర్చడానికేమీ లేదు? ఎందుకంటే, దశాబ్దాలుగా ఓటరు మోసపోతూనే వున్నాడు.. ప్రలోభాలకు గురవుతూనే వున్నాడు. ఫలానా పార్టీకి ఓటేస్తే జనం తమను ఉద్ధరించేస్తారని నమ్ముతున్నారు, భంగపడుతున్నారు.

రాజకీయ నాయకులు ఇంకా ఇంకా ధనవంతలువుతున్నారు. పేదలు నానాటికీ మరింత పేదరికంలోకి తొక్కివేయబడుతున్నారు. మరి, సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి.? వాటి ఫలితాలేంటి.? అంటే, వాటి దారి వాటిదే, వెనకబాటుతనం దారి వెనుకబాటుతనానిదే.

ప్రజలెప్పుడూ బాగుపడకూడదన్నది భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీల ఆలోచన. ప్రజలు ఎప్పుడైతే ప్రలోభాలకు లొంగే పరిస్తితి వుండదో, అప్పుడసలు రాజకీయ పార్టీల్ని ప్రజలు పట్టించుకోవడమే మానేస్తారు. అందుకే, అన్ని రాజకీయ పార్టీలూ వీలైనంతవరకు ప్రజల్ని ఓ లైన్ కిందనే వుంచాలని చూస్తాయి, వుంచుతున్నాయి కూడా.

సరే, ఇప్పుడిదంతా ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ట్వీటేశారు. ‘ఎరను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో వున్న ప్రతి జాతి వేటగాళ్ళకు చిక్కుతూనే వుంటుంది..’ అంటూ వాకాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి రాసిన కోటేషన్‌ని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

ఈ ట్వీటు ఎవర్ని ఉద్దేశించి పవన్ వేశారో అందరికీ తెలుసు. ఆయన ఆశించిన రెస్పాన్స్ కూడా అట్నుంచి ట్రోలింగ్ రూపంలో వస్తూనే వుంది. పవన్ ఒడ్డున వున్నారు గనుక రాళ్ళేస్తున్నారు.. ఆయనా అధికారం అనే బురదలోకి దిగితే, అధికారం వచ్చే పరిస్థితి వుంటే.. ఆయనా ఎరవేయక తప్పదు.

ఎన్నికల హామీల్నే ‘ఎర’ అంటారు. ఆ లెక్కన పవన్ కూడా 2019 ఎన్నికల్లో ఎర వేసిన విషయాన్ని విస్మరిస్తే ఎలా.?