జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్ నోటి నోటి నుండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటూ మాట్లాడాల్సి వస్తే పాపం పవన్ కళ్యాణ్ హృదయం ఎంత బరువెక్కిపోతుందో అని ఆలోచిస్తే బాధ కలుగుతుంది. కానీ ఆంధ్రాలో జరుగుతున్నా పరిణామాలు గమనిస్తే పవన్ కళ్యాణ్ కు అది తప్పుకు పోవచ్చని తెలుస్తుంది. బీజేపీ తో కలిసి వైసీపీ కేంద్రంలో అధికారం పంచుకోబోతుందనే వార్తలు రాగానే జనసేన అధినేత గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఉంటాయి.
2019 ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవటంతో పార్టీని నడిపించటమే కష్టంగా మారిన తరుణంలో ఏదో బీజేపీ తో కలిసి రాష్ట్రంలో ఉనికిని కాపాడుకుంటూ 2024 లో బీజేపీ, జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగాలని కాటమరాయుడు భావించాడు. కానీ జగన్ బీజేపీ తో దోస్తీ కట్టబోతున్నాడు అనేసరికి పవన్ కళ్యాణ్ ఆశలు అన్ని కూలిపోయాయి. అదే కనుక జరిగితే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయం పక్కన పెడితే, రాష్ట్రంలో తన పరిస్థితి, తన పార్టీ పరిస్థితి ఏమైపోతుందో అనే బెంగ పట్టుకుంది. జగన్ ను సీఎం కానివ్వను అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జగన్ సీఎం అయినా తర్వాత తట్టుకోలేక జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ తనదైన శైలిలో మాట్లాడటం మొదలుపెట్టాడు.
అధికారపక్షాన్ని తిట్టటమే రాజకీయం అనుకున్న పవన్ కళ్యాణ్ అదే పని చేస్తూ వస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు వైసీపీ బీజేపీ తో జత కడితే తాను కూడా వైసీపీకి అనుకూలంగానే మాట్లాడాల్సి వస్తుంది. పొత్తు ధర్మం ప్రకారం వైసీపీ చేసే పనులను సమర్దించాలి. ఎదో అప్పుడప్పుడు ఒకరి రెండు ప్రెస్ నోట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదల చేసి, ట్విట్టర్ లో జగన్ ను టార్గెట్ చేస్తూ రెండు మాటలు మాట్లాడితే చాలు రాజకీయంగా ఉనికిని చాటుకున్నామని భావించే పవన్ కళ్యాణ్ కి ఇక ఆ ఛాన్స్ ఇక ఉండదు. దీనితో పార్టీ శ్రేణులు తనని మర్చిపోయే ప్రమాదం ఉందని అయన భావిస్తున్నాడు. దానికి తోడు జగన్ బీజేపీ తో జతకడితే బీజేపీ పార్టీ తనని చీపురపుల్ల మాదిరి చూస్తుందేమో అనే భయం జనసేనాని మదిలో మెదులుతుంది. దీనితో వైసీపీ బీజేపీ ఎక్కడ పొత్తు పెట్టుకుంటాయో అనే భయాందోళనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది.