Pawan Kalyan: స్వరం మారుస్తున్న పవన్ కళ్యాణ్… కూటమి నిర్ణయాలకు వ్యతిరేకం.. అసలేం జరుగుతోంది?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన స్వరం మారుస్తున్నారా అంటే అవునని తెలుస్తోంది. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఏం చెప్పితే దానికి సై అంటున్న పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మాత్రం తన నిర్ణయాలను నిర్మొహమాటంగా చెబుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్న నేపథ్యంలో అసలు కూటమిలో ఏం జరుగుతోంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ముఖ్యంగా అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాతనే ల్యాండ్ పూలింగ్ పై నిర్ణయం తీసుకోవాలని ఈయన తెలియజేసారట. ఈ విషయం గురించి క్యాబినెట్ మీటింగ్ లో చర్చలు జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ అడ్డుపడి తన నిర్ణయాన్ని తెలియజేయడంతో ఇందుకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.

ఈ అంశం గురించి మాత్రమే కాకుండా నాలా చట్ట సవరణ ప్రతిపాదనని కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారని తెలుస్తోంది. నాలా చట్ట సవరణ అంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించడమేనని, ఇలా చేయటం వల్ల వ్యవసాయం చేసే భూమి దుర్వినియోగం అవ్వటమే కాకుండా రైతులకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లుతాయని పవన్ ఈ విషయంలో కూడా అడ్డుపడ్డారని తెలుస్తోంది. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయాల విషయంలో పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ విషయం కాస్త కూటమిలో చర్చలకు కారణం అవుతుంది.