అనుకున్నంత అయ్యింది.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు

pk and somu

 ఆంధ్రాలో బీజేపీ నేతల మాటలెప్పుడు కోటలు దాటుతాయి, కానీ చేతల్లో పని మాత్రం ప్రహరీ గోడ కూడా దాటవు అనేది ఎప్పటి నుండో ఉన్న ప్రచారం. తాజాగా వాటిని నిజం చేసే సంఘటనలు మరోసారి జరిగాయి. ఆంధ్ర లో జరిగిన మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు దారులు మూడంటే మూడే సర్పంచు స్థానాలు గెలుచుకుంది. మూడువేల పంచాయితీ ఎన్నికలు జరిగితే మూడు స్థానాలు మాత్రమే అంటే బీజేపీ సత్తా ఏమిటో సృష్టంగా తెలుస్తుంది.

pk and somu

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత గ్రామంలో కూడా బీజేపీ మద్దతుదారుడు గెలిచినట్లు ఎక్కడ లేదు. వాళ్ళు చేసే రాజకీయాలకు, వాళ్ళు మాట్లాడే మాటలకూ ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉంది. ఒక విధంగా బీజేపీ కంటే పవన్ కళ్యాణ్ జనసేన చాలా చోట్ల ప్రభావం చూపించింది. దాదాపు 30 నుండి 40 స్థానాల్లో జనసేన మద్దతు దారులు విజయం సాధించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మరియు జనసేన విషయంలో జరిగింది కూడా ఇదే.

 ఇక ఈ పరిణామాన్ని విశ్లేషిస్తే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల విషయంలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ ఎడ్జి ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది. తిరుపతి లో జనసేన పోటీచేస్తే కనీస పోటీ అయిన ఉంటుంది, కాదు కూడదు అంటూ బీజేపీ పోటీచేస్తే అసలు సోదిలో కూడా లేకుండా పోతుందని ఈ పంచాయితీ ఎన్నికలు నిరూపితం చేస్తున్నాయి.

 అయితే ఇవేమి పట్టించుకోని రాష్ట్ర బీజేపీ మాత్రం తిరుపతి స్థానం మాకే కావాలని ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను ఈ విషయంలో సర్దుబాటు చేయాలనీ అమిత్ షా, జేపీ నడ్డా లాంటి నేతలతో పవన్ కళ్యాణ్ కు చెప్పించే పనిలో ఉన్నారు. అంత పెద్ద నేతలు తనను పిలిచి మరి ఆ మాటలు చెప్పేసరికి కరిగిపోతున్నాడు పవన్. ఎదో త్యాగమూర్తి అనే ట్యాగ్ ఒకటి తగిలించుకొని వస్తున్నాడు తప్పితే, అయన తీసుకుంటున్న నిర్ణయాల వలన పార్టీ ఎంతగా నష్ట పోతుందో ఆలోచిస్తున్నాడో లేదో అర్ధం కానీ పరిస్థితి. త్యాగాలు చేసుకుంటూ పోతే… జనసేన బలంతో బీజేపీ బలపడుతుంది. చివరికి జనసేనను పూచిక పుల్లలా తీసి పడేస్తుంది