పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి వైవిధ్యమైన చిత్రాలు చెయ్యడం, అలాగే ఒక ప్రత్యేకమైన, నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఆయన సినిమాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అయితే సినిమాల్లో వచ్చిన గుర్తింపు అడ్డుపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అట్టర్ ప్లాప్ అవుతున్నారు. ఆయన మొదట నుండి కూడా రాజకీయాల్లో ఎలాంటి పనులు అయితే కొత్త రాజకీయ పార్టీలు చెయ్యకూడదో అలాంటి పనులే చేస్తూ పార్టీకి, ఆయన సిద్ధాంతాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని గంగలో కలుపుతున్నారు. ఇప్పుడు తాజగా పవన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి.
పాకిస్థాన్ ప్రస్తావన అవసరమా!!
ఏపీలో ఇప్పుడు హిందు దేవుళ్ళ విగ్రహాలను పగలకొట్టడం అనే కొత్త సాంప్రదాయం మొదలైంది. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు కానీ నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో కూడా రాముని విగ్రహాన్ని ఎవరో దుండగులు పగలగొట్టారు. అయితే ఈ ఘటనపై రాష్ట్రంలో ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాకిస్తాన్ లో ఒక హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు కులగొడితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించే బాధ్యత తీసుకుందని, జగన్ ప్రభుత్వం కనీసం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్న బాధ్యత కూడా లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.
పవన్ పై బీజేపీ ఆగ్రహం
బీజేపీకి అసలు పాకిస్థాన్ అంటేనే పడదు. అలాంటి సందర్భంలో తమతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ ను పొగడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ చేసిన వ్యాఖ్యలు కేవలం జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతియ్యడానికి తప్పా ఎక్కడా కూడా అందులో స్పష్టత లేదని , గతంలో టీడీపీ హయాంలో ఆలయాలను ప్రభుత్వమే పడగొట్టినా పవన్ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకు జగన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ తో పోల్చడం అవసరం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.