వైరల్ : “వకీల్ సాబ్” లో ఆ డైలాగ్ చెప్పలేనన్న పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ లో ఉన్న బిగ్ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ తన సినిమాల పరంగా ఎంత అన్ బ్యాలన్స్ గా ఉంటాడో తెలిసిందే. దీనితో ఎప్పుడుకో గాని కొన్ని సినిమాలు పూర్తి కావు కానీ తన మూడ్ గాని బాగుంటే జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తాడు.

మరి అలాగే తన కెరీర్ లో భారీ ప్లాప్ “అజ్ఞ్యాతవాసి” తర్వాత దాదాపు మూడున్నరేళ్ల తర్వాత చేసిన చిత్రమే “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో హిట్ గా నిలిచింది. పైగా  ప్యాండమిక్ టైం లో కూడా 90 కోట్ల వరకు షేర్ రాబట్టి పవన్ నుంచి మంచి కం బ్యాక్ గా నిలిచింది.

అయితే తాజాగా పవన్ తన రాజకీయ పార్టీ మీటింగులో ఈ సినిమాలో ఓ డైలాగ్ బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పడం వైరల్ గా మారింది. ఆ డైలాగ్ ఏంటంటే ఈ చిత్రంలో పల్లవి పాత్రని ఆర్ యూ ఏ వర్జిన్ అనే డైలాగ్ విషయంలో అట.

ఆ డైలాగ్ కోసం నన్ను చెప్పమన్నపుడు నేను చెప్పానని చెప్పానని అలాగే అప్పుడు ఇలాంటి ప్రశ్న ఆడవాళ్లకే ఎందుకు వర్తిస్తుంది? మగవాళ్లకు ఎందుకు కాకూడదు అనేది నా ఉద్దేశం అప్పుడు అలా చేయించానని పవన్ తెలిపాడు.

దీనితో ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇదిలా ఉండగా పవన్ అయితే మరో రీమేక్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.