Pawan Ex Wife : ఇది టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అభిమానులకి నిజంగా ఒక షాకింగ్ మరియు బాధాకరమైన వార్తే అని చెప్పాలి. పవన్ కి మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ మరియు పవన్ కొడుకు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ లు కరోనా పాజిటివ్ గా తేలినట్టు కన్ఫర్మ్ అయ్యింది.
మరి ఈ ఊహించని వార్తని స్వయంగా రేణు దేశాయ్ నే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసి షాక్ ఇచ్చారు. అయితే ఇదిలా ఉండగా తాను ఈ పోస్ట్ తో మరిన్ని షాకింగ్ నిజాలు తెలియజేసారు.
ఈ కరోనా మూడో వేవ్ ని ఏవరు తేలికగా తీసుకోవద్దని తాము ఇంట్లోనే ఉంటున్నా కూడా ఇప్పిడి కరోనా పాజిటివ్ గా వచ్చామని, కాకపోతే కొన్ని రోజులు కితమే తాము పాజిటివ్ అయినా ఇపుడు క్రమంగా కోలుకుంటున్నట్టు ఆమె తెలిపారు. మరి దీనితో పాటుగా తాను ఆల్రెడీ రెండు డోసులు వాక్సిన్ వేసుకున్నా మళ్ళీ తనకి కరోనా సోకినట్టు రేణు దేశాయ్ తెలిపారు.
ఇక అలాగే అకిరా కి అయితే వాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపు పాజిటివ్ వచ్చింది అని మరో షాకింగ్ నిజాన్ని వెల్లడి చేశారు. అందుకు అంతా ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించండి అని తెలిపారు.