షాకింగ్ : రీసెంట్ గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న ఈ స్టార్ హీరోకి మళ్ళీ కరోనా..!

covid positive : ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా సెలెబ్రెటీలకు కాంట్రవర్సీలు తప్పవు. తాము అప్పటివరకు ఎన్ని మంచి పనులు చేసినా ఎక్కడో వారి చిన్న పొరపాట్లు భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి. అయితే అలా రీసెంట్ గా అసలు తాను అనుకోని రీతిలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అక్షయ్ కుమార్ విమల్ పాన్ విషయంలో కాంట్రవర్సీ లో ఇరుక్కొని అనేక విమర్శలు అభిమానుల ఆగ్రహానికి లోనయ్యాడు.

అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ స్టార్ హీరోనే మరో షాకింగ్ వార్త చేరవేసాడు. తాను ఇప్పుడు మళ్ళీ కరోనా బారిన పడ్డానని కన్ఫర్మ్ చేసాడు. అయితే తాను ఫ్రాన్స్ ఓ జరిగే క్యానన్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళవలసి ఉంది అని కానీ అనుకోని రీతిలో కోవిడ్ పాజిటివ్ తాను కావడంతో వెళ్లలేకపోతున్నాను అని అక్షయ్ తెలిపాడు.

ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నాను అని త్వరలోనే తిరిగి వస్తానని తెలిపాడు. ఇక ఇదిలా ఉండగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా అయినటువంటి పృద్వి రాజ్ భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉండగా దాని నుంచి వచ్చిన ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా వచ్చింది.