Young Hero Got Corona : బ్రేకింగ్..మరో టాలీవుడ్ యంగ్ హీరోకి కరోనా! వాక్సిన్ వేసుకున్నా కూడా

Young Hero Got Corona : మళ్ళీ ప్రపంచాన్ని కరోనా కబళించడం స్టార్ట్ చేసింది దీనితో ఒక్కసారిగా అందరికీ కాస్త అయోమయం నెలకొంది. ఒక్కసారిగా రైజ్ అవుతున్న కేసులు చూస్తుంటే మళ్ళీ ప్రపంచం ఏమవుతుంది అని ప్రశ్న లేవనెత్తుతుంది. అయితే ఈ కరోనా మూడో వేవ్ నిజమే అన్నట్టుగా ఆల్రెడీ టాలీవుడ్ హీరోలకి కూడా స్టార్ట్ అయ్యింది.

మొన్ననే మంచు వారి హీరో మంచు మనోజ్ కి కరోనా వచ్చింది అని వార్త షాకివ్వగా ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో తాను కరోనా బారిన పడ్డట్టు తెలియజేసాడు. అతడు మరెవరో కాదు యాంగ్రీ యంగ్ మెన్ విశ్వక్ సేన్. రీసెంట్ గానే “పాగల్” సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.

తాను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని ఆశ్చర్యకర విషయం ఏమిటంటే తాను ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్నా అయినా కరోనా బారిన పడ్డానని తెలిపాడు. ఇది నిజంగా షాక్ అని చెప్పాలి. దీనితో విశ్వక్ ప్రతి ఒక్కరినీ మాస్క్ వేసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ప్రస్తుతానికి అయితే విశ్వక్ సేన్ “గామి”, “అశోక వనంలో అర్జున కళ్యాణం” అనే సినిమాలు చేస్తున్నాడు.