Chiranjeevi : బిగ్ బ్రేకింగ్ : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..కానీ అదే ఎనర్జీ!

Chiranjeevi :  ఈ ఏడాది కరోనా మూడో వేవ్ మాత్రం గత రెండు సార్లు మిస్సయిన వారు అందరికీ అటాక్ చేస్తుందని చెప్పాలి. పలు భారీ సినిమాలు ఆగిపోవడమే బాధాకరం అనుకుంటే వాటిని మించి దక్షిణాదికి చెందిన అనేకమంది స్టార్ నటులే పాజిటివ్ గా నిర్ధారణ అవుతుండడం మరింత షాకింగ్ అంశంగా మారింది. మరి ఇందులో కూడా కాస్త గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ కరోనా బారిన పడ్డ వారు అంతా కూడా తిరిగి కొలుకుంటున్నారు.

మరి ఇదిలా ఉండగా మరో షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది. టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తాను కరోనా పాజిటివ్ అయ్యినట్టు గా తెలిపారు. తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను అన్ని తగు జాగ్రత్తలు పాటించినప్పటికీ కరోనా బారిన పడ్డానని.. నిన్న రాత్రి కొద్దిపాటి లక్షణాలు ఉండడంతో తాను హోమ్ క్వారంటయిన్ తీసుకున్నానని.

దయచేసి ఈ మధ్యలో తనని కలిసిన వారు అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి అని మెగాస్టార్ సూచించారు. అలాగే చివరి మాటగా మళ్లీ మీ అందరినీ ఎంత త్వరగా చూడాలని ఉందో అని ఆసక్తిగా తెలిపారు. దీనితో మెగా ఫ్యాన్స్ అంతా చిరు ఆరోగ్యం కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తుండగా ఇతర సినీ తారలు కూడా తెలిపారు. మరి ప్రస్తుతం మెగాస్టార్ అయితే నాలుగు సినిమాలు షూటింగ్స్ చేస్తుండగా వాటిలో ఆచార్య అల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.