ఇండస్ట్రీ టాక్ : ఆలీ, పవన్ ఫ్యాన్స్ కి అప్పుడు సమాధానాలు దొరుకుతాయా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్న ఎందరో స్నేహితుల్లో చాలా మంచి బాండింగ్ ఉన్నటువంటి నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ఆలీ లు కూడా ఒకరు. అయితే వీరి స్నేహానికి సంబంధించి ఎన్నో సందర్భాలు కూడా కనిపించాయి. అయితే ఈ స్నేహం కేవలం సినిమా వరకే పరిమితం అన్ని ఆలీ ప్రూవ్ చేసి పవన్ కి పవన్ ఫ్యాన్స్ కి దెబ్బ కొట్టాడు.

ఇది వాస్తవం కాగా రాజకీయాల్లో అయితే ఆలీ పవన్ వెంట నిలబడకపోవడం అనేది ఆసక్తిగా మారగా అక్కడ నుంచి ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. అలాగే పవన్ ఫ్యాన్స్ కూడా ఆలీ అంటే ఇష్టం కూడా తగ్గించుకున్నారు. ఇక అక్కడ నుంచి అయితే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూ ఉండగా..

మళ్ళీ ఇద్దరు పెద్దగా కలిసిన దాఖలాలు కూడా లేవు. కానీ పవన్ ఫాన్స్ కి అయితే ఫైనల్ గా ఇద్దరి మధ్య గొడవలకి సమాధానాలు అతి త్వరలో దొరికే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఆలీ అయితే ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..

తన షో ఆలీతో సరదాగా కి గాను పవన్ ని పిలిచే అవకాశం ఉందని ఇప్పుడు షూటింగ్ తమకి దగ్గరలోనే జరుగుతుందని తెలిపాడు. దీనితో అయితే మళ్ళీ వీరి కలయిక ఎదురెదురుగా ఉండడం అనేది ఆసక్తిగా మారింది. మరి సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా చూడాలి.