నరేష్ తో తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన పవిత్ర లోకేష్.. ఆయన నా భర్తే కాదు!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలనాటి ప్రముఖ హీరో సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు నరేష్ తో తన పెళ్ళి గురించి ఇటీవల చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం ఈ వార్తల గురించి ఎక్కడా స్పందించని పవిత్ర తాజాగా ఒక కన్నడ టీవి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో నరేష్ కి తనకి మధ్య ఉన్న బంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి తోడు వీరిద్దరు ఇటీవల మహాబలేశ్వరం ఆలయానికి వెళ్లి అక్కడ ఇద్దరు స్వామీజీని దర్శించుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యులో ఈ పెళ్లి వార్తల గురించి స్పందిస్తూ..నేను నరేష్ ఇప్పుడు సహజీవనం చేస్తున్నాము. నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా కృష్ణ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అందుకే మేము మా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాము. ప్రస్తుతం నేను కృష్ణ, నరేష్ తో కలిసి ఫామ్ హౌస్ లో ఉంటున్నాము అంటూ పవిత్ర నరేష్ తో తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది.

ఇక తన మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి పవిత్ర మాట్లాడుతూ.. సుచేంద్ర ప్రదాస్‌ కి నాకు పెళ్ళి జరగలేదు. మేమిద్దరం అధికారికంగా పెళ్ళి చేసుకోలేదు. మేము రిలేషన్‌షిప్‌లో ఉండి కొంత కాలం సహజీవనం చేశాం. మాకు అధికారికంగా పెళ్లి జరగనప్పుడు ఇక విడాకుల గురించి ప్రస్తావన ఎందుకు వస్తుంది. ఈ విషయంలో అతడు నన్ను ప్రశ్నించడు. నేను కూడా అత్తను చేసే పనుల గురించి ఎప్పుడు ప్రశ్నించను. మా ఇద్దరి మధ్య ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా సుచేంద్ర కుటుంబ సభ్యులు ఇప్పటికీ నాతో చాల సన్నిహితంగా ఉంటారు అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది.