జనసేన పార్టీ కాదు ఒక ప్రభంజనం.. అన్యాయం అవుతున్న వారి పాలిట ఆశాదీపం.. ఎక్కడ న్యాయం ముసుగు వేస్తుందో అక్కడ జనసేన గళం విప్పుతుంది అంటూ ఎన్నో ట్యాగ్‌లతో మొదలైన జనసేన పార్టీ పరిస్దితి ప్రస్తుతం ఎవరికి అర్ధం అవడం లేదట.. ఎందరితో దోస్తీ కట్టిన అందరు తూచ్ అంటూ తొక్కేస్తున్నారట.. చివరికి రాజధాని రైతు వ్యవసాయ కూలీల సంక్షేమ అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా ఉన్న లాజార్ మృతి విషయంలో ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్‌కు భంగపాటు కలిగింది.. ఏమయ్యా పవన్.. ఇప్పుడు గుర్తొచ్చారా మా నాన్న.. అంటూ పులి చిన లాజర్ కుమార్తె ఎస్తేర్ పెట్టిన ట్వీట్ పెను సంచలనంగా మారిందన్న విషయం తెలిసిందే..
ఇక పవన్ గతంలో అమరావతి పేరుతో జరిగిన ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ, వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొని నినాదాలు కూడా చేశారు. ఆ తర్వాత కూడా అమరావతికి మద్దతుగానే మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సై అంటూనే.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు.. కానీ ప్రస్తుతం అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరిన ఆందోళనలపై ఆయన పెదవి కూడా విప్పలేదు. కనీసం ఓ ట్వీట్ కూడా చేయలేదు. మరి అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా నోరు మెదపకున్న ఈ జనసేన అధినేతలో ఇంత మార్పుకు కారణం ఏంటనే ఆసక్తి ఏపీలోని ప్రజల్లో, నాయకుల్లో కలుగుతుందట.. మరికొందరైతే పవన్ కల్యాణ్ కి ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్టుంది. అందుకే అమరావతి జోలికి వెళ్లడం లేదంటు గుసగుసలాడుకుంటున్నారట.. జనసేన సైనికులైతే కేంద్రం ఏమైనా వారించిందా.. అసలేంటి కారణం అనే అనుమానంతో అల్లాడుతున్నారట.
ఇదిలా ఉండగా అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమంలో నిజమైన రైతులెవరూ లేరని, కేవలం పెట్టుబడిదారులు మాత్రమే వెనకుండి దీన్ని నడిపిస్తు నాటకాలాడుతున్నారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. కాగా ఈ ప్రచారానికి జీవం పోసింది టీడీపీ అని, దీంట్లో వామపక్షాలు, బీజేపీ, జనసేన కానీ.. అందరూ పావులు మాత్రమే. ఈ పావుల్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాటకాలాడుతోందంటున్నారు వైఎస్ జగన్ ఆత్మీయులు..
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుత విధానాన్నే భవిష్యత్ లో కూడా కొనసాగిస్తారా లేక.. చంద్రబాబు రెచ్చగొడితే మళ్లీ ఆ ఉచ్చులో చిక్కుకుంటారా అనే అనుమానం కొందరిలో పుడుతుందట.. ఏది ఏమైనా ఆ పార్టీకి అధినేతగా ఆయన నిర్ణయాలు ఆయనకుంటాయి.. ఎవరు ఏం చెప్పిన చివరికి లాభం అయినా, నష్టం అయినా జనసేన అధినేతకే చెల్లుతుందని సమర్ధించే వారు సమర్ధిస్తున్నారు..