స్టింగ్ ఆపరేషన్ లో నరేశ్ తో తనకి ఉన్న రిలేషన్ గురించి బయటపెట్టిన పవిత్ర…!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్, నటుడు నరేష్ గత కొంతకాలంగా ఎక్కడ చూసినా కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ అనుమానం కలుగుతుంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని, సహజీవనం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ మహాబలేశ్వరంలోని ఒక దేవాలయాన్ని దర్శించి అక్కడ ఉన్న స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలకి మరింత బలం చేకూరింది. అయితే నరేష్ మాత్రం వివాహ వ్యవస్థ మీద తనకు విరక్తి పుట్టిందని చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఒక కన్నడ ఛానల్ వారు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా నటి పవిత్ర లోకేష్ నరేష్ తో తనకి ఉన్న సంబంధం గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. కొంతకాలంగా నరేష్ తో కలిసి ఆమె సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించింది. వారి సహజీవనానికి కృష్ణ కుటుంబ సభ్యుల ఆమోదం కూడా ఉంది అంటూ పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్టింగ్ ఆపరేషన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నరేష్ మూడో భార్య రమ్య చేస్తున్న ఆరోపణల గురించి నిజా నిజాలు తెలుసుకోవడానికి ఈ స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు ఆ ఛానల్ వారు వెల్లడించారు.

అయితే పవిత్ర లోకేష్ ఇలా నరేష్ తో ఉన్న అనుబంధం గురించి బయట పెట్టడంతో వీరికత ఏమలుపు తిరుగుతుందో అంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు నరేష్ మూడో భార్య రమ్య కూడా నరేష్ మీద చాలా ఘాటుగా స్పందిస్తోంది. తనమీద ఆర్థిక నేరాలు మోపి సమాజంలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నాడు అంటూ రమ్య నరేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విషయంలో నిజా నిజాలు బయట పెడతాను అంటూ నరేష్ ఇటీవల ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. కాకపోతే వేరే కార్యక్రమం ఉండటంతో నరేష్ ఆ మీడియా సమావేశాన్ని రద్దు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ఉన్న సంబంధం హార్ట్ టాపిక్ గా మారింది.