ఏపీ మున్సిపోల్స్ లో 50 శాతానికి పైగా ఓట్లు వైసీపీకే !

ycp party telugu rajyam

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితం ఏక పక్షంగా నిలిచింది. వైసీపీ ఫ్యాన్‌ గాలికి సునామీలా వీచింది. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు… ఆ మున్సిపాలిటీ, ఈ కార్పొరేషన్ అని తేడా లేదు.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలే. రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం ఇలాంటి కారణాలేవీ వైసీపీ సునామీని అడ్డుకోలేకపోయాయి. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 73 మున్సిపాలిటీలతో పాటు, 11 కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసింది.

YSRCP in dialoma with CBI notices 
YSRCP 

వైసీపీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి. టీడీపీ కొంత మేర పోటీ ఇచ్చినప్పటికీ… ఇతర పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదయిందనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక, ఓట్ల షేరింగ్‌ లేనూ సత్తా చాటింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు దక్కించుకున్న వైసీపీ.

ఇక, సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ భారీగా ఓట్లు కోల్పోయింది.. మరోవైపు.. సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా ఓట్ షేర్ పెంచుకున్నాయి బీజేపీ, జనసేన.. ఓట్ల శాతం వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ 52.63 శాతం ఓట్లు సాధించగా.. తెలుగేదేశం పార్టీ 30.73 శాతానికి పడిపోయింది.. బీజేపీ 2.41 శాతం ఓట్లు సాధిస్తే.. జనసేన 4.67 ఓట్లు, సీపీఎం 0.81 శాతం ఓట్లు, సీపీఐ 0.80 శాతం ఓట్లు సాధించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 0.62 శాతానికి పరిమితం కాగా.. బీఎస్పీ 0.09 శాతంగా.. మిగిలిన రిజిస్టర్డ్ పార్టీలు 0.44 శాతం.. ఇండిపెండెంట్స్ 5.73 శాతం ఓట్లు సాధించారు.. నోటాకు 1.07 శాతం ఓట్లు రావడం విశేషం.