Paritala Sriram: లోపల ఒరిజినల్ క్యారెక్టర్ అలానే ఉంది…. పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు!

Paritala Sriram: రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల పరంగా ఎంతో యాక్టివ్గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన 2019 ఎన్నికలలో రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. ఇక ఈ ఎన్నికలలో ధర్మవరం నుంచి ఈయన టికెట్ అందుకొని పోటీకి దిగుతారని అందరూ భావించారు కానీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా ధర్మవరం బిజెపి కైవసం చేసుకుంది.

ఇక పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ధర్మవరంలో ఈయన మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు కార్యకర్తలను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మన అరచేయి ఆయుధంగా మారుతుందని తెలిపారు

సమయమే మించిపోలేదు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. సూర్యుడు అస్తమించాలి అంటే సమయం పడుతుంది కానీ మీరెందుకు డీలా పడిపోతున్నారు అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరికి మీరు భయపడాల్సిన పనిలేదని, గ్రామాలలో మీ పనులను మీరు చక్కగా చేసుకోండి అంటూ ఈయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీరు మంచి చేసిన చెడు చేసిన నన్ను నమ్మి వచ్చిన మీ వెంట నేను తప్పకుండా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇక ధర్మవరం నాకు చాలా ఓపికను నేర్పించింది. బయటకు ఇలా శాంతంగా కనిపించినా లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంది అంటూ పరిటాల శ్రీరామ్ ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధర్మవరం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా తన వ్యాఖ్యలతో అభిమానులకు కార్యకర్తలకు ఊహించని బూస్టింగ్ ఇచ్చారని చెప్పాలి.